వర్షాలకు దెబ్బతిన్న వంతెనల నిర్మాణాలు చేపట్టాలి

– కలెక్టర్ కు బతికెపల్లి సర్పంచ్ శోభారాణి వినతి

Date:19/09/2020

జగిత్యాల  ముచ్చట్లు:

వర్షాలకు దెబ్బతిన్న వంతెన నిర్మాణానికి మరమ్మతులు చేపట్టాలని బతికెపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి జిల్లా కలెక్టర్ గుగులోతు రవి కి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా శోభారాణి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికెపల్లి-లింగాపూర్ రోడ్డులో గల బతికెపల్లి వద్ద గల వంతెన వర్షాలకు మూలంగా వంతెన వద్ద  వరద ప్రవాహం ఉదృతంగా ఉండడంతో వంతెన కొంత మేర కూలిపోవడమే గాకుండా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. అంతేగాకుండా ఇదే రోడ్డులో గల రెండు కల్వర్టులు వరదల కారణంగా దెబ్బతిన్నాయని దీంతో ఈ రోడ్డు పై వాహనదారులు వెళ్లడానికి భయపడుతున్నారని తెలిపారు. యుద్ధప్రాతిపదికన వంతెన, కల్వర్టుల మరమ్మతులు చేపట్టాలని శోభారాణి కలెక్టర్ ను కోరారు.

కర్ణాటకలో మళ్లీ వర్ష బీభత్సం..లోతట్టు ప్రాంతాలు జలమయం!

Tags: Construction of rain-damaged bridges should be undertaken

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *