పుంగనూరులో రచ్చబండ నిర్మాణం
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ఏడూరు గ్రామంలో రచ్చబండ నిర్మాణ కార్యక్రమాన్ని శుక్రవారం గ్రామస్తులు భూమిపూజ చేసి ప్రారంభించారు. సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ నాగభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ నిర్మాణానికి సుమారు రూ.2 లక్షల రూపాయలను వాటర్‌షెడ్ పనులతో నిర్మిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు రచ్చబండను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్‌షెడ్ పీవో ధనుంజయవర్మ, కమిటి చైర్మన్ మునిరాజ తదితరులు పాల్గొన్నారు.

Tags; Construction of Ratchabanda in Punganur
