పుంగనూరు మున్సిపాలిటి అనుమతితో నిర్మాణం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఇందిరా సర్కిల్‌లో తమ సొంత స్థలంలో మున్సిపల్‌ అనుమతులు పొంది రూములు నిర్మిస్తున్నట్లు యజమాని ఉమాదేవి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇందిరాసర్కిల్‌లో తాను 1999లో కొనుగోలు చేసిన పాత భవనాన్ని తొలగించి, ప్రస్తుతం రూములు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొంత మంది దురుద్ధేశంతో మున్సిపల్‌ అనుమతులు లేకుండ నిర్మాణాలు చేస్తున్నారని, తనపై , అధికారులపై ఆరోపణలు చేయడం వాస్తవం కాదన్నారు. మున్సిపాలిటి వారు తనకు అక్టోబర్‌ 10న అనుమతులు మంజూరు చేశారని ఆమె రికార్డులు చూపించారు. వాస్తవాలు తెలుసుకోకుండ ఆరోపణలు చేసి, మనోభావాలను దెబ్బతీయ్యరాదని కోరారు.

 

Tags: Construction with permission of Punganur Municipality

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *