Onion tear without cutting

ఉల్లిపాయల కోసం వినియోగదారుల ఎదురుచూపు

-వూరించారు రైతుబజారుల్లోఅమ్మకాలు ఉట్టిఎక్కించారు

Date:30/10/2020

విజయవాడ  ముచ్చట్లు:

ఉల్లిపాయలు వినియోగదారులకు సబ్సిడీ ధరలపై రైతుబజారుల్లో అందించిన అధికారులు అమ్మకాలు ఉట్టి ఎక్కించారు.  ఒకరికి ఒక్క కిలో ఉల్లిపాయలు అందించిన వ్యవసాయ శాఖ అధికారులు  డిమాండుకి తగ్గట్టుగా ఉల్లిపాయలు అందించలేకపోయారు.  పైగా నాసిరకం పాయలు అంటగడుతున్నారని  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో అధికారులు ఉల్లి అమ్మకాలు ఆపేశారు. ఈనెల 23 నుండి రైతుబజారుల్లో కిలో రూ 40 లకే అమ్మకాలు ప్రారంభించారు.  తొలుత రెండురోజుల పాటు మంచి ఉల్లిపాయలు అందించారు. ఆతరువాత కుళ్ళిన ఉల్లిపాయలు వచ్చాయని వినియోగదారుల అల్లాడారు.  విజయవాడ ,నందిగామ, మచిలీపట్నం రైతుబజారుల్లో మాత్రమే ఉల్లిపాయలు అమ్మారు.  జిల్లాలో మిగతా రైతుబజారుల్లో అమ్మకాలు జరగాల్సింది. ఈ లోగా కుళ్లిన ఉల్లి లొల్లి మొదలైనది.  ఉల్లి మహారాష్ట్ర పూణే,నాసిక్ ,నుండి దిగుమతి చేసుకుని వ్యవసాయ శాఖ వినియోగదారుల కు అందిస్తుంది.  ఇప్పటివరకు జిల్లాలో 95 టన్నుల ఉల్లిపాయలు అమ్మకాలు సాగాయి.   క్వాలిటీ కోసం ఇద్దరు  పూణేలో ఉండగా  రాష్ట్రం నుండి మరో 10 మందిని పంపామని వారు నాణ్యమైన ఉల్లిపాయలు ఎంపిక చేసి ఇక్కడ కు పంపనున్నారని మార్కెటింగ్ శాఖ  అధికారులు అంటున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం కిలో ఉల్లిపాయలు రూ 26 లకే అందిస్తామని ప్రకటన ఇంకా కార్యరూపానికి నోచుకోలేదు.   అందాకా వినియోగదారుల ఉల్లిపాయలు బహిరంగ మార్కెట్ లో కిలో రూ 80నుండి 90 పెట్టె కొనాల్సిందే. .అసలే కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.  దానికితోడుగా  ఆకుకూరల ధరలు కూడా మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి.   గతంలో రూ 10 కి 5 కట్టలు అమ్మారు. నేడు ఆకుకూరల కట్ట ఒక్కటి రూ 5 లకు అమ్ముతున్నారు.  అదీనూ కట్టలు అతి చిన్నగా ఉంటున్నాయని వినియోగదారుల అల్లాడుతున్నారు.

కన్నబిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులు

Tags: Consumer anticipation for onions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *