Natyam ad

పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై పోటీ: ఆలీ

తిరుపతి  ముచ్చట్లు:


వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని సినీ నటుడు ఆలీ జోస్యం చెప్పారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని తిరుపతిలో వ్యాఖ్యానించారు. ఎక్కడి నుంచైనా పోటీకి తాను రెడీ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ తనకు మంచి స్నేహితుడని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆలీ చెప్పారు.నిజ జీవితంలో ఆలీ, పవన్ కల్యాణ్ మంచి స్నేహితులు. పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ఒకట్రెండు సినిమాలు మినహా.. అన్నింటిలోనూ ఆలీ నటించారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో నిలిచారు. ఆలీ మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నారు.

 

Tags; Contest against Janasena chief Pawan Kalyan if party orders: Ali

Post Midle
Post Midle