Natyam ad

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల ముచ్చట్లు:


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనము కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. శని ఆదివారాలు కావడంతో స్వామివారి దర్శనం కోసం తిరుమలకి  వస్తున్నారు.వైకుంఠం కంపార్ట్మెంట్లన్నీ నిండి భక్తులు బయట క్యూ లైన్ లో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్ను ఒక్కరోజే దాదాపు 84 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిదర్శనానికి దాదాపు 22 గంటల పైన పడుతుంది. క్యూలైన్లో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు అన్న ప్రసాదం, త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండాటీటీడీ అధికారులు క్యూలైన్లను  పర్యవేక్షిస్తున్నారు.

 

Tags: Continual rush of devotees in Tirumala

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.