Natyam ad

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి ముచ్చట్లు:

తిరుమలలో భక్తుల రద్దీ నేడు బుధవారం కొనసాగుతోంది.స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్వామివారిని మంగళవారం 73,879 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

 

Post Midle

Tags: Continual rush of devotees in Tirumala

Post Midle