అష్టదళపాదపద్మారాధన సేవ కొనసాగింపు
తిరుప్పావడ సేవా టికెట్లు గలవారికి బ్రేక్ దర్శనం
తిరుమల ముచ్చట్లు:

వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం జూన్ 30వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు టిటిడి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవాటికెట్లను జూన్ వరకు ఆన్లైన్ లో విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు. కావున ఆన్లైన్ లో సేవాటికెట్లు బుక్ చేసుకున్న వారిని అష్టదళపాదపద్మారాధన సేవకు అనుమతించాలని టిటిడి నిర్ణయించింది.అదేవిధంగా, అడ్వాన్స్ బుకింగ్ లో జూన్ 30వ తేదీ వరకు తిరుప్పావడ సేవా టికెట్లు గలవారు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనానికి రావాలని కోరింది. లేనిపక్షంలో సేవాటికెట్ రీఫండ్ పొందాలని కోరడమైనది.
Tags:Continuation of the Ashtadala Padamaradhana service
