Natyam ad

దస్తావేజు లేఖరుల వ్యవస్థను ఎప్పటిలాగానే కొనసాగించండి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటి వేణుగోపాల్

కడప ముచ్చట్లు:

Post Midle

రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖలో అనాదిగా దస్తావేజు లేఖరుల వ్యవస్థ ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం లేఖర్ల వ్యవస్థను లైసెన్సులు ఇచ్చి కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని దస్తావేజులేఖరుల వృత్తి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటి. వేణుగోపాల్, కడప నగర అధ్యక్షులు యు. సంజీవ రాయుడు లుప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ను వ్యతిరేకిస్తూ  జిల్లా రిజిస్ట్రేషన్  స్టాంపుల శాఖ కార్యాలయం వద్ద శనివారం దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు ,డిటిపి ఆపరేటర్లు, లేఖరుల సహాయకులు రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ ధర్నా కార్యక్రమంలో గుంటి.వేణుగోపాల్,
యు. సంజీవరాయుడులు పాల్గొని లేఖర్ల ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ.. అక్టోబరు 2వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ల ప్రక్రియకు సన్నాహాలు చేస్తోందని దీనివలన ప్రజల ఆస్తులకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో బ్రిటిష్ కాలము నుండి ఇచ్చే భద్రత సచివాలయాల్లో లేకుండా పోతుందని దీనివలన అనేక భూ తగాదాలు, ప్రభుత్వ భూములు స్వాహా ప్రజల ఆస్తుల కబ్జాలకు గురై ప్రజల ఆస్తులకు ఉన్న భద్రత కోల్పోయే ప్రమాదం ఉన్నదనితక్షణం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.

 

 

 

దస్తావేజు లేఖరుల వ్యవస్థ వలన రిజిస్ట్రేషన్ శాఖకు ఆర్థిక వనరులు సమకూర్చే అనుసంధాన కర్తలుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం దస్తావేజు లేఖర్లు కొనసాగుతూ ప్రజల ఆస్తుల రిజిస్ట్రేషన్లు దస్తావేజులు వ్రాసి రిజిస్టర్లు చేయించి ప్రజలు ఇచ్చే సాధారణ ఫీజులతో కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని అన్నారు. దస్తావేజు లేఖరుల వ్యవస్థలో ఎం.ఏ, బిఏ,బిటెక్లు చదువుకుని ఏ ఉపాధి ఉద్యోగం దొరకక రిజిస్టర్ కార్యాలయాల్లో స్టాంపులు అమ్ముకుంటూ, అగ్రిమెంట్లు, దస్తావేజులు రాసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారు రాష్ట్రంలో సుమారు లక్ష మందిపైబడి ఉన్నారని వారి కుటుంబాలను వీధిలపాలు చేసే సచివాలయలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అని విమర్శించారు.

 

 

ఈ ధర్నా కార్యక్రమంలో దస్తావేజులేఖరుల వృత్తి పరిరక్షణ సమితి గడప నగర నాయకులు నాగరాజు, ఓబులేసు, రామకృష్ణారెడ్డి, లోకనాథం, మోహన్ ,ఇక్బాల్, మహేష్, నాగమల్లేసు, సుబ్బరాయుడు, వై సుబ్బరాయుడు ,రామకృష్ణ, హరి, తిరుమల రెడ్డి, నాగరాజు, అశోక్ కుమార్, శ్రీనివాసులు, రియాజ్, శంకర్, సుబ్బరాయుడు, మహమ్మద్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Continue the system of deed scribes as usual

Post Midle