కొనసాగుతున్న గాలింపు చర్యలు

Date:20/07/2018
కాకినాడ ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక వద్ద ఏడు రోజుల కిందట జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఏడుగురిలో ఇప్పటి వరకూ నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురి కోసం గత ఏడు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు లో  నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎస్పీఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బందితో  పాటు స్థానిక మత్స్యకారులు కలిపి 21 బృందాలు పాల్గోంటున్నాయి. భైరవపాలెం, యానాం, ఎదుర్లంక తీరాల్లో రెస్క్యూ టీమ్స్ కొనసాగిస్తున్న అన్వేషణ కొనసాగిస్తున్నాయి.  ఇంకా ఆచూకీ దొరకని ముగ్గురు బాలికలు కొండేపూడి రమ్య (14),  పోలిశెట్టి అనూష (13), పోలిశెట్టి సుచిత్ర (11)ల ఆచూకీ ఇంకా దొరకలేదు. గాలింపు చర్యలు జేసీ మల్లిఖార్జన, అమలాపురం డిఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం వరద ఉధృతి పెరగడం,  వర్షం కురవడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది.
కొనసాగుతున్న గాలింపు చర్యలుhttps://www.telugumuchatlu.com/continuing-action-actions/
Tags: Continuing action actions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *