నిరంతర ప్రగతి కార్యక్రమాలు జరగాలి

-జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల ముచ్చట్లు:

గ్రామాలు, పట్టణాల మొక్కలతో నిండి పరిశుభ్రంగా, అందంగా ఉండాలన్న సంకల్పంతో  జూలై 1వ తేది నుండి  ప్రారంభించిన పల్లెప్రగతి, పట్టణప్రగతి,  హరితహారం కార్యక్రమాలను పదిరోజుల కొరకు ఏర్పాటు చేసినది ఎవరు బావించకుండ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ జి.  కలెక్టర్ అన్నారు.  శనివారం మెడిపల్లి, కొండపూర్, వెంకటరావుపేట,  కథలాపూర్ మండలం భూషన్ రావు పేట గ్రామాలలో పర్యటించి నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, హరితహారం కార్యక్రమాలను పరిశీలించారు.  ఈ సందర్బంగా మెడిపల్లి మండలంలో రోడ్డు వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపుల మూడు వరుసలలో పెద్దమొక్కలను నాటాలని అన్నారు.  అన్ని ఒకేరకమైన మొక్కలను కాకుండా పండ్లమొక్కలను కూడా నాటాలని, తద్వారా ప్రజల్లో మొక్కల  సంరక్షణపై ఆసక్తి పెరుగుతుందని పేర్కోన్నారు.  నాటిన మొక్కలను ఏవరైన కావాలని చెడగొడితే వారికి వేయి రూపాయల జరిమాణాను విధించాలని ఆదేశించారు.  పెరిగిన మొక్కలకు కలర్ వెయించాలని సూచించారు.కోండాపూర్ గ్రామంలో పద్మశాలి కళ్యాణమంటపం లో ఏర్పాటుచేసిన 4వ విడత పల్లెప్రగతి చివరిరోజు కార్యక్రమంలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ జూలై 1వ తేది నుండి ప్రారంభించుకున్న పల్లెప్రగతి, పట్టణప్రగతి మరియు హరితహారం కార్యక్రమంలో మిగిలిన గ్రామాలతో పోల్చుకుంటే కొండాపూర్ గ్రామంలో ఆభివృద్ది ప్రగతి కార్యక్రమాలను చక్కగా చేయడంలో కృషిచేసిన అధికారులను, సర్పంచ్ ను అభినందించారు.

 

 

 

 

 

గ్రామాల అభివృద్ది అనేది కోన్ని రోజుల కొరకురూపొందించుకున్న కార్యక్రమం కాదని, అది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సూచించారు.  గ్రామంలో అంగన్ వాడి, ఆశా, ఎఎన్ఎం లు ఇంటింటికి వెళ్లి తడిచెత్త, పొడిచెత్త వేరువేరుగా చేసి ట్రాక్టర్లకు అందించెలా అవగాహనను కల్పించాలని సూచించారు.  మన ఇంటి లోపల, ఆవరణ ఎంత బాగా శుభ్రం చేసుకుని అందంగా తీర్చిదిద్దుకుంటామో ఆదే విధంగా మన గ్రామాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకొవాలని అన్నారు.  గ్రామాలలో గోడలపై అనవసరంగా వ్రాసిన రాతలపై వైట్ వాష్ వేయించాలని, ఇకపై  యజమాని అనుమతి లేకుండా గోడలపై వ్రాతలు వ్రాసేవారిపై  చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించాలని అన్నారు.  గ్రామాలను పరిశుభ్రంగా అందంగా, మొక్కలను నాటుకుని వచ్చే తరాలకు మంచి గ్రామాలను అందివ్వాలని అన్నారు.  అనంతరం వెంకట్రావే పేట గ్రామంలో మొక్కను నాటి, గ్రామంలోని పైమరి పాఠశాలను పరిశీలించారు. శిథలావస్థలో ఉన్న  పాఠశాల పునరుద్దరణకు గ్రామస్థులు, ఇతర ప్రాతాలలో స్థిరపడివారి నుండి నిధులు సమకూర్చుకోవాలని, మిగిలిన నిధులను సమకూర్చుతానని జిల్లా కలెక్టర్ హమిఇచ్చారు.

 

 

 

 

కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి అనవసరంగా దారి కొరకు ఎక్కువ స్థలాన్ని వినియోగించకుండా ఇంకా మొక్కలను నాటాలని సూచించారు.  ఒకే రకమైన మొక్కలను కాకుండా వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను నాటాలని,  బెంచీలను ఏర్పాటు చేయాలని, మియావాకి పద్దతిలో మొక్కలను నాటాలని, నర్శరి, పల్లెప్రకృతి వనం చూట్టు వెదురు మొక్కలను నాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కథలాపూర్ తహసీల్దార్ మదు, యంపిడిఓ నవీన్, ఆర్.డబ్లు.ఎస్ ఏఈ ముబిన్, మెడిపల్లి  యంపిఓ సుష్మజ, మెడిపల్లి సర్పచ్ వరలక్ష్మి, కొండాపూర్ గ్రామ సర్పంచ్ జి. అబిలాష్, వెంకట్రావు పేట సర్పంచ్ జగన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Continuous progress programs must take place

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *