కామారెడ్డి బస్టాండ్ ఎదుట కాంట్రాక్ట్ లెక్చరర్స్ నిరసన

Date:21/05/2020

కామారెడ్డి  ముచ్చట్లు:

కరోన సమయంలో ఇంటర్మీడియట్ మూల్యాంకన విధులు నిర్వర్తించేందుకు కామారెడ్డి నుంచి నిజాంబాద్ వెళ్తున్న తమకు ప్రత్యేక బస్సులు కేటాయించాలని కాంట్రాక్ట్ లెక్చరర్స్ డిమాండ్ చేశారు మంగళవారం వరకు ప్రత్యేక బస్సులు కేటాయించి  కనీసం సమాచారం ఇవ్వకుండా బస్సు నిలిపివేయడంతో బస్టాండ్ ఎదుట గంటపాటు నిరసన వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవో పద్మారావు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోన సమయంలోనూ నిజాంబాద్ కి వెళ్లి ప్రతిరోజు మూల్యాంకన విధులు నిర్వహించామని,రెగ్యులర్ బస్సులు ఆర్టీసీ మొదలుపెట్టిన సందర్భంగా వీరికి వేసిన బస్సులు నిలిపివేయడం వల్ల సరైన టైంలో మూల్యాంకన వెళ్లలేకపోయమ్ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కలెక్టర్ చొరవ తీసుకొని కామారెడ్డి నుంచి నిజాంబాద్ మూల్యాంకనం వెళ్లే వారికి ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు.లేనిపక్షంలో విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు . ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు.

వినియోగం ఎక్కువైతే …విద్యుత్ బిల్లులు రావడం సహజం

Tags: Contract lecturers protest in front of Kamareddy bust

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *