జిల్లా ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ స్టాప్ నర్సులు నిరసన

విశాఖపట్నం ముచ్చట్లు:

 

రాష్ర్ట వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు (నర్సింగ్ ఆఫీసర్లు)  రెగ్యులర్ చేయాలని, అందరికి 34 వేలు వేతనం, 35 క్యాజువల్ లీవులు అమలు చేయాలని, కోవిడ్  సోకిన వారికి 21 లీవులు అమలు, కోవిడ్ విధులలో ఉన్నవారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వివిధ విభాగలలోని వారికి వేతన బకాయిల చెల్లింపు తదితర సమస్యల పరిస్కారం కోరుతూ పాడేరు జిల్లా ఆసుపత్రి వద్ద 2 వరోజు  నిరసన తెలిపారు. ఈ నెల కాలంలో మరణించిన 20 మంది కాంట్రాక్టు నర్సులు చనిపోయారు,రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగుల కు బీమా సౌకర్యం కల్పించారు.కాంట్రాక్టు ఉద్యోగులు కోవిడ్ తో చనిపోయిన ఎటువంటి బీమా సౌకర్యం లేదు కావున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు నేటికి 2 సంవత్సరాలు గడిచినా పర్మినెంట్ చేయలేదు.ఆసుపత్రి సూపరండెంట్ కి వినతి పత్రం సమర్పించారు.సమస్యలు పరిష్కరించక పోతే జూన్ 28 న సమ్మె నిర్వహిస్తామని నినదించారు.. ఈ కార్యక్రమంలో అప్పలనరస,స్వామి, యేలీషా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు. తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Contract stop nurses protest in front of district hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *