పుంగనూరులో కరోనా నియంత్రణకు సహకరించండి

పుంగనూరు ముచ్చట్లు:

 

 

మున్సిపాలిటి పరిధిలో కరోనా ప్రభావం తగ్గిందని , పూర్తిగా నివారించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ కోరారు. ఆదివారం పట్టణంలోని 16 సచివాలయల పరిధిలోను వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చైర్మన్‌ అలీమ్‌బాషా ప్రారంభించారు. అలాగే మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మెడికల్‌ ఆఫీసర్‌ సల్మా, కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, అర్షద్‌అలి, రేష్మా, కిజర్‌ఖాన్‌, కాళిదాసు, నటరాజ, భారతి, మమత, గంగులమ్మ, లలిత , మంజునాథ్‌ లు వారి వార్డు సచివాలయలలో దగ్గరుండి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్‌ రెడ్డికార్తీక్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలసి విజయవంతం చేశారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Contribute to corona control in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *