పుంగనూరులో నులిపురుగు నిర్మూలనకు సహకరించండి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు నులిపురుగు నిర్మూలన కార్యక్రమాలను  బుధవారం   మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రెడ్డికార్తీక్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రారంభించారు.  పట్టణంలోని రహమత్‌నగర్‌ పాఠశాలలో విద్యార్థుల ద్వారా ర్యాలీ నిర్వహించి, విద్యార్థులకు మాత్రలు వేశారు. ఆయన  మాట్లాడుతూ పిల్లలకు డివార్మింగ్‌ మాత్రలను ఉచితంగా పంపిణీ చేసి, నులిపురుగుల నిర్మూలన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో , అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలను తీసుకెళ్లి డివార్మింగ్‌ చేపట్టాలని తెలిపారు. పోషక ఆహార లోపం, రక్తహీనతలు, మానసిక అభివృద్ధి మందకుడిగా ఉండటం లాంటి లక్షణాలు రాకుండ జాగ్రత్తలు తీసుకుని నులిపురుగు నిర్మూలనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకుడు మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

 

Tags: Contribute to deworming in Punganur

Leave A Reply

Your email address will not be published.