పంచాయతీ  పన్నులు వసూలు చేయటంలో ప్రజాప్రతినిధుల సహకారం

 Date:14/05/2019
హనుమాన్ జంక్షన్ ముచ్చట్లు:
గ్రామపంచాయతీ లలో పన్నులు వసూలు చేయటంలో ప్రజాప్రతినిధులు సైతం సహకారం అందించాలని బాపులపాడు ఎం.పి.పి. తుమ్మల కోమలి అన్నారు.బాపులపాడు మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం జరిగింది.ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆమె మాట్లాడుతూ వేసవిలో గ్రామాల్లో మంచినీటికి ఇబ్బంది పడకుండా కార్యదర్సులు చర్యలు తీసుకోవాలన్నారు.ఎం.పి.టి.సి.లు కొందరు సంతకాలు పెట్టి వెళ్లిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు.జడ్.పి.టి.సి.సభ్యురాలు కైలే జ్ఞానమణి మాట్లాడుతూ ఇదే చివరి సమావేశమని చూస్తుండగానే అయిదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయని అన్నారు. ఈ సమావేశంలో ఇటీవల మరణించిన సూపర్ డెంట్ ప్రత్తిపాటి జాన్ సుధాకర్ మృతికి 2 నిముషాలు మౌనం పాటి0చారు.ఈ సమావేశంలో ఇంకా వైస్ ఎం.పి.పి గుళ్ళపూడి సరోజిని,ఎం.డి.ఓ.జి.వి.కె. మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
Tags: Contribution of the Public Prosecutors to the Panchayat Taxes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *