నక్కబండ ఉర్ధూహైస్కూల్‌గా మార్పు

Conversion into Nakkabanda Urdu School

Conversion into Nakkabanda Urdu School

Date:22/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని నక్కబండలో గల ఇస్లాంనగర్‌ యూపిస్కూల్‌ను హైస్కూల్‌గా మార్పుచేస్తూ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ కమిషనర్‌ చిన్నవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఈ విషయమై ముస్లిం మైనార్టీలతో కలసి పాఠశాల వద్ద వైఎస్సార్సీపి నాయకుడు ఖాదర్‌బాషా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఖాదర్‌బాషా మాట్లాడుతూ యూపిస్కూల్‌ను ఉర్ధూహైస్కూల్‌గా మార్పుచేస్తూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకుని మైనార్టీలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నారని కొనియాడారు. మంత్రి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు అగ్రస్థానం కల్పించారని ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటి చైర్మన్‌ ముభారక్‌బాషా, హెడ్‌మాస్టర్‌ సుహేబ్‌అహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

వెంకన్న ఆలయ అర్చకుడు మృతి

Tags: Conversion into Nakkabanda Urdu School

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *