Natyam ad

కమ్యూనిటి వైద్యశాల ఏరియా ఆసుపత్రిగా మార్పు – మంత్రి పెద్దిరెడ్డిచే ప్రారంభం

– రూ.33.50 కోట్లు విడుదల

పుంగనూరు ముచ్చట్లు:

 

సుమారు 40 సంవత్సరాలుగా ఎలాంటి ఎదుగుబొదుగు లేని ప్రభుత్వ ఆసుపత్రికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహార్ధశ పట్టింది. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్పు చేసి బుధవారం రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరోనా కలచివేసింది. ఈ సమయంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు తమ సొంత నిధులు రూ.3 కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. అలాగే వెంటిలేటర్లు, చిన్నపిల్లల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిగా మార్పు చేశారు. సుమారు 100 మంది డాక్టర్లు, సిబ్బంది కలసి 24 గంటలు ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలు అందించనున్నారు. ప్రస్తుతం ఇందు కోసం భవనాలు, సిబ్బందికి, వసతులకు రూ.33.50 కోట్లు మంత్రి పెద్దిరెడ్డి మంజూరు చేయించారు. అధునాతన వసతులతో ఏరియా ఆసుపత్రి నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఏరియా ఆసుపత్రిగా మార్పు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Post Midle

ఏర్పాట్లు..

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి బుధవారం రానుండటంతో ఏర్పాట్లను కమిషనర్‌ నరసింహప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఆసుపత్రి కమిటి చైర్మన్‌ డాక్టర్‌ శరణ్‌కుమార్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags: Conversion of Community Hospital into Area Hospital – Inauguration by Minister Peddireddy

Post Midle