వంట గ్యాస్ లీక్…ముగ్గురు సజీవ దహనం
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
వంట గ్యాస్ లీక్ అవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచ లో విషాదఛాయులు అలుముకున్నాయి.ఒకే కుటుంబానికి చెందిన వంట గ్యాస్ లీక్ అవడంతో భార్యాభర్తలు మండిగ నాగ రామకృష్ణ,శ్రీ లక్ష్మి,పిల్లలు సాహిత్య సజీవ దహనం అయ్యారు. మరో పాప సాహితి పరిస్థితి మరింత విషమం ఉండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు..నిజంగా ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండరు లీక్ అయి చనిపోయారా..? ఏమైనా ఆర్ధిక ఇబ్బందులు వల్ల సుసైడ్ చేసుకున్నారా..?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు.
పుంగనూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Cooking Gas Leak… Three live burns