ఆలయాల్లో కూలర్లు..ఏసీలు

Date:10/05/2019

కాన్పూర్  ముచ్చట్లు :
బాబోయ్ ఎండాకాలం.. భానుడు భగ, భగ మండిపోతున్నాడు. తెలుగు రాష్ట్రాలే కాదూ దేశవ్యాప్తంగా నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ ఎండలకు తోడు.. వడగాలులు, చికాకు పెట్టే ఉక్కపోత కూడా తోడైతే నరకమే. అందుకే జనాలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఇంట్లో హాయిగా ఏసీలు, కూలర్ల కింద సేద తీరుతున్నారు. మనుషులేనా.. దేవుళ్లకు కూడా ఉక్కపోయదా.. ఇదేం తిక్క ప్రశ్నని షాకవ్వకండి. దేవుళ్లకు ఉక్కపోత తప్పడం లేదట.. అందుకే గర్భగుడిలో కూలర్లు, ఏసీలు పెట్టేస్తున్నారు. కాన్పూర్‌లోని సిద్ధి వినాయక్ గణేష్ ఆలయంలోని గర్భగుడిలో కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. గణనాధుడి ఆలయమే కాదు.. మరికొన్ని గుడుల్లో కూడా ఈ ఏసీలు, కూలర్లు పెట్టేశారు. కొన్ని ఆలయాల్లో ఏసీ, కూలర్లు బదులు ఫ్యాన్లతో సరిపెట్టేస్తున్నారు. ఆలయాల్లోని గర్భగుడిలో ఏసీలు, కూలర్లు చూసి.. ఇదేంటని భక్తులు ఆలయంలో పూజర్ల దగ్గర ఆరా తీస్తున్నారట.
Tags:Coolers in temples .. ACs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *