బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లుతో సహకార బ్యాంకులు నిర్వీర్యం

Date:17/07/2020

ఏలూరు  ముచ్చట్లు:

సహకార బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు తీసుకురావడం దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ విమర్శించారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం- సహకార బ్యాంకులు అంశం పై స్థానిక అన్నే భవనంలో గురువారం ఆయన మాట్లాడారు. సహకార బ్యాంకింగ్ రంగం రాష్ట్రాల పరిధిలో అంశమని దీనిపై కేంద్రం ఏకపక్షంగా చట్టం ఎలా తెస్తుందని అని ఆయన ప్రశ్నించారు. కొత్త చట్టం ద్వారా సహకార బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి తెస్తారని చెప్పారు. సమర్థవంతంగా నడుస్తున్న కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల పరిధి నుండి సహకార బ్యాంకులను తప్పించడం సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని చెప్పారు. వాణిజ్య బ్యాంకులు లాభర్జనే ధ్యేయంగా పనిచేస్తాయని వాటిలో సహకార  బ్యాంకులను కలపడం సమర్థనీయం కాదన్నారు. రైతులకు ఆర్థిక, నైతిక సహకారం అందించాలని లక్ష్యంతో సహకార బ్యాంకులు ఏర్పాటైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరిచిపోవడం శోచనీయమన్నారు. సహకార బ్యాంకులను నిర్వీర్యం చేసే కేంద్ర బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లుకు పార్లమెంట్లో వైయస్సార్ సి పి, తెలుగుదేశం పార్టీలు మద్దతు ప్రకటించడం రాష్ట్రంలో సహకార రంగానికి ఉరి వేయడమేనని  విమర్శించారు. సహకార రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు వ్యతిరేకంగా రైతాంగం ఆందోళనలకు సమాయత్తం కావాలని కోరారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

Tags:Cooperative banks weakened with the Banking Regulation Bill

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *