ఇంద్రకీలాద్రి పై సమన్వయ లోపం

Coordination deficiency on Indrakechlari

Coordination deficiency on Indrakechlari

Date:13/10/2018
విజయవాడ ముచ్చట్లు:
దసరా మహోత్సవాలు జరుగుతునన్న సమయంలో విజయవాడ ఇంద్రకీలాద్రి లో దేవస్థానం ఈవో ఓ కోటేశ్వరమ్మకు, పాలకమండలి సభ్యులకు మధ్య విభేదాలు పోడచూపాయి. గుడిలో ప్రతిచోటా గేట్లకు తాళాలు వేస్తున్నారంటూ ఇఓపై పాలకమండలి సభ్యుడు శంకరబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పాలకమండలి సభ్యుల హంగామాపై ఈవో అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో శనివారం ఆలయానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రకు పాలకమండలి పై ఇఓ ఫిర్యాదు చేసారు. మంత్రి  పాలకమండలి చైర్మన్ గౌరంగబాబును, సభ్యుడు శంకర్ బాబుని పిలిచి మాట్లాడారు. ప్రతిచోటా గేట్లకు తాళాలు వేసి, భక్తులకు అసౌకర్యం కల్పిస్తున్నారంటూ తాళాలు వేసిన గేట్లను మంత్రికి  పాలకమండలి సభ్యులు చూపించారు. తమకు ఇఓ గౌరవం ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేసారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు సంయమనంతో వుండాలని మంత్రి  సూచించారు.
Tags:Coordination deficiency on Indrakechlari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *