Corden Search in Canopy

కంభంలో కార్డెన్ సెర్చ్ 

Date:30/11/2019

ఒంగోలు ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా కంభం మండలంలోని స్థానిక అర్బన్ కాలనీ లో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు మార్కాపురం సీఐ కె.రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో 6 మంది ఎస్సైలు, 5 మంది ఏ ఎస్సైలు, 120 మంది సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
మార్కాపురం రూరల్ ఎస్సై గంగుల వెంకట్, మార్కాపురం టౌన్ ఎస్సై కిషోర్ బాబు, అర్దవీడు ఎస్సై సాంబశివరావు, బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి, కంభం ఎస్సై మాధవరావు, పెద్దారవీడు ఎస్సై రామకృష్ణ మరియు 120 మంది సిబ్బంది తో కలిసి ముకుమ్ముడిగా శనివారం ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. కాలనీలో ఉన్న ద్విచక్రవాహనాలు ఆటోలు బయటికి వెళ్లకుండా ప్రతి వీధి దగ్గర గట్టి బందోబస్తు ఏర్పడు చేశారు. అనంతరం ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని ద్విచక్రవాహనాలు, ఆటోలను గుర్తించారు. దాదాపు 53 ద్విచక్రవాహనాలు. ఆరు ఆటోలు. ఒక ట్రాక్టర్. 12 కత్తులను స్వాధీనపరుచుకొని స్టేషన్ కు తరలించారు.

 

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రజల ఆందోళన!!

 

Tags:Corden Search in Canopy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *