రిమ్స్ ఆర్కే నగర్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్
కడప ముచ్చట్లు:
జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రిమ్స్ సి.ఐ కె.రామచంద్ర, ఎస్.ఐ నారాయణ, సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసారు. తనిఖీల్లో రికార్డులు లేని 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు పోలీసులు సూచించారు.
మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాటుసారా ప్రభావిత ముదిరెడ్డి పల్లి తాండా లో కుడా పోలీసు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, సిబ్బంది జాయింట్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ లలితా దేవి, ఎస్.ఐ గణ మద్దిలేటి, సిబ్బంది తనిఖీలు చేసారు. నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags; Cordon and search at Rims RK Nagar Colony

