Natyam ad

నక్కల దిన్నెలో కార్డన్ అండ్ సెర్చ్

మదనపల్లె ముచ్చట్లు:

 

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నక్కలదిన్నె, నక్కలదిన్నె తాండా నందు కార్డన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని డిఎస్పీ కేశప్ప తెలిపారు. నేటి ఉదయం మదనపల్లె వన్ టౌన్, టుటౌన్, సెబ్
అధికారులు సంయుక్తంగా నక్కలదిన్నె నందు కార్డన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వన్ టౌన్, టుటౌన్, సెబ్ స్టేషన్లకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ గంగాధర రావు ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్
కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో నాటు సారా లభ్యం కాక పోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇదే విధంగా ఇక్కడి ప్రజలు భవిష్యత్తులోనూ నాటు సారా తయారీ,
విక్రయాలకు దూరంగా ఉండాలని సూచించారు. అదే విధంగా రికార్డులు సరిగ్గా లేని ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి యజమానులు వాహనాలకు సంబంధించిన రికార్డులు
చూపిస్తే విడుదల చేయడం జరుగుతుందని వివరించారు.

 

Tags:Cordon and search in fox den

Post Midle
Post Midle