మొక్కజొన్న.. పోషకాలు మిన్న..

Corn .. Nutrients Mint ..

Corn .. Nutrients Mint ..

Date:17/07/2018
పశ్చిమగోదావరి ముచ్చట్లు:
వానాకాలం స్పెషల్ ఫుడ్.. మొక్కజొన్నపొత్తు. చల్లటి వాతావరణంలో వేడివేడి పొత్తులు తింటుంటే.. ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ టేస్టీ ఫుడ్.. పోషకాల గని అని.. ఆరోగ్యప్రదాయని అని ఆహారనిపుణులు చెప్తున్నారు. అందుకే ఈ సీజన్ లో.. అంతా తమ ఆహారంలో మొక్కజొన్నలకూ చోటు కల్పించాలని సూచిస్తున్నారు. ఇటీవలిగా అందరికీ ఆరోగ్య స్పృహ పెరిగింది. పోషకాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలపై ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఎలాంటి హాని లేని మక్కలకూ ప్రాధాన్యతనిస్తున్నారు. మొక్కజొన్నలను నూనెలు, మసలాలు లేకుండా విభిన్న రకాల్లో తీసుకోవచ్చు. ఒక కప్పు మొక్కజొన్న గింజలతో లభించే క్యాలరీస్‌133 గ్రా. ఇకకార్బొహైడ్రేట్స్‌ 30.8 గ్రా., కొవ్వు 1.5 గ్రా., ప్రొటీన్‌ 4.9 గ్రా. లభిస్తాయి. అంతేకాక విటమిన్‌ 173.8 గ్రా., పొటాషియం 329మి.గ్రా., కాల్షియం 24.6మి.గ్రా. అందుతుంది. మెగ్నీషియం 24.6 మి.గ్రా, సోడియం 489 మి.గ్రా, నీరు 126 గ్రా. లభిస్తుంది. అందుకే మొక్కజొన్నలకు ఆహారంలో తగినంత ప్రాధాన్యతనివ్వాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
మొక్కజొన్న.. పోషకాలు మిన్న..https://www.telugumuchatlu.com/corn-nutrients-mint/
Tags: Corn .. Nutrients Mint ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *