Natyam ad

కోరమండల్ సేవలు అభినందనీయం

కాకినాడ ముచ్చట్లు:

సంకల్ప  శుద్ధితో చేసే సేవా కార్యక్రమాలు ఎంతో విలువైనవని ఆ దిశగా కోరమండల్ మహిళా క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని న్యాయవాది శ్రీలక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో కోరమాండల్  మహిళా క్లబ్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక రోగులకు నిత్యవసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ లక్ష్మి మాట్లాడుతూ త్యాగగుణం అన్ని గుణాలలోనూ ఉత్తమమైందని అన్నారు. పరులకు సహాయం చేస్తుంటే మనలో పాజిటివ్ ఫీలింగ్స్ పెరుగుతాయని అన్నారు. క్లబ్బు కార్యదర్శి మల్లీశ్వరి మాట్లాడుతూ తమ క్లబ్ అధ్యక్షురాలైన వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రతినెలా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు అందజేస్తున్నామన్నారు. నిస్సహాయులకు చేయూతనివ్వడానికి తమ మహిళా క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ సృజన, మోహిని కుమారి, అంజుమ్, డాక్టర్ కుమార్ యాదవ్, అడబాల రత్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Coromandel’s services are commendable

Post Midle
Post Midle