Corona agitation in Punganur

పుంగనూరులో కరోనా కలకలం

Date:01/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటీ పరిధిలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. శనివారం రోజు మాత్రం ఆరు కేసులు బయటపడ్డాయి. కాగా ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 114 చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కమిషనర్  కెఎల్. వర్మ ఆధ్వర్యంలో, సీఐ గంగిరెడ్డి ,కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సహాయ చర్యలు చేపట్టారు .  ప్రతిరోజు 50 మంది నుంచి 100 మందికి చికిత్స చేయడంతో కరోనా బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది . ఈ విషయమై కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు మాస్క్లు ధరించి ఉండాలని సూచించారు.   ఊరికే పట్టణాల్లో తిరగరాదు అని కోరారు. కరోనా ను నియంత్రించేందుకు ప్రజలు అందరూ సహకరించాలని కోరారు . కాగా మున్సిపల్ కార్యాలయం వద్ద నివాసము ఉన్నవారికి కరోనా సోకడంతోమున్సిపల్ కార్యాలయాన్ని కూడా రెడ్ జోన్ ప్రకటించి రాకపోకలు నిషేధించారు .

ఇద్దరు డాక్టర్లతో ఆస్పత్రికి అనారోగ్యం

Tags: Corona agitation in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *