పాదయాత్రలకు లేని కరోనా అడ్డంకి

Date:18/11/2020

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కారణంగా ఈ ఏడాది మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను 2021, ఫిబ్రవరిలో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కింది.
ఏపీ స్ధానిక సంస్ధల ఎన్నికలపై ఎంపి రఘురాం క్రిష్ణంరాజు ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.వైసీపీ పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి.. ఎన్నికల నిర్వహణకు ఎందుకని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఎన్నికలు అంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 151 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటి నుంచి.. ఏం చేసినా చెల్లుతుందనే భావన తమ పార్టీ నేతల్లో కనిపిస్తోందన్నారు. ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్‌ లేఖ బాధ్యతారాహిత్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నిమ్మగడ్డ రాజీనామా కోరడం..రాజ్యాంగ సంస్థలను విచ్ఛిన్నం చేయడానికి నిదర్శనమని  రఘురామ కృష్ణరాజు విమర్శించారు. గవర్నర్ ప్రేక్షక పాత్ర వహిస్తే కోర్టులు జోక్యం చేసుకుని.. ఎన్నికలు నిర్వహించమని ఆదేశించవచ్చన్నారు. అధికారులు, పోలీస్ సిబ్బంది ముందుకు రాకుండా.. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తెచ్చుకోవద్దని రఘురామ హితవు పలికారు.
కరోనా ఇంకా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం సరికాదంటూ సీఎస్ నీలం సాహ్నీ నిమ్మగడ్డకు లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా లేఖ రాయడం గమనార్హం.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ఇందుకు ప్రకటన విడుదల చేయాలని ఆయన కోరడం గమనార్హం. కరోనా ప్రభావం తగ్గిందని, పొరుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏపీలోనూ నిర్వహించాలని రఘురామ లేఖలో రాసుకొచ్చారు.మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇసుక విధానం దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే,  మాన్సాస్‌ ట్రస్టు విషయంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ట్రస్టు ఆస్తుల పరిరక్షణ బాధ్యతను అశోక్‌గజపతి రాజుకు అప్పగించాలన్నారు.

 బీజేపీ రాష్ట అధ్యక్షులు బండి సంజయ్ చిత్ర పటానికి క్షీరాభిషేకం

Tags: Corona barrier that does not hike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *