కరోనా కాటు..గ్రామస్థుల వెలి వ్యక్తి ఆత్మహత్య

కుప్పం  ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాళ్యం పంచాయతీ చిన్న బొగ్గుపల్లిలో గ్రామస్తుల వేధింపులకు మనస్థాపానికి గురై తీతగిరి (55)  ఆత్మహత్య చేసుకున్నడు. వివరాల్లోకి వెళితే పైపాల్యం పంచాయతీ బొగ్గుపల్లి గ్రామానికి చెందిన తీతగిరి కుమారుడు హరినాథ్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని గ్రామస్తులు వారితో గొడవకు దిగారు. దాంతో తితగిరి తన కుమారుడు హరినాథ్ ను కుప్పం ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్కు తీసుకెళ్లి కొవిడ్ పరీక్షలు  చేయగా నెగిటివ్ రావడంతో కుమారుడు హరినాథ్ ను ఇంటికి తీసుకొని వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మళ్ళీ వాగ్వాదానికి దిగారు. మీరు కుటుంబంతో పాటు ఒక నెల గ్రామం వదలి పెట్టి పోవాలని గొడవ చేయడంతో మనస్తాపానికి గురైన తితగిరి తన స్వగృహంలోనే ఉరి వేసుకున్నట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Corona bite..Village Veli
The person committed suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *