Corona break for dairy cows

పాడి ఆవుల వ్యాపారానికి కరోనా బ్రేక్‌

– కబేళాలకు వెళ్లని పశువులు 30 వేలు
-వ్యాపారుల వద్ద 20 వేల పశువులు

Date:03/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పాడి ఆవులకు ప్రసిద్ది. తమిళనాడు , తెలంగాణ , కర్నాటక రాష్ట్రాల నుంచి రైతులు, వ్యాపారులు ఇక్కడికి వచ్చి పశువులను కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఇలా ఉండగా కరోనా వైరస్‌తో గత నెల 20 నుంచి పశువుల సంత ఆగిపోయింది. ప్రతి మంగళ, బుధవారాల్లో పశువుల సంత నిర్వహిస్తారు. బంద్‌ కారణంగా వ్యాపారులు, రైతులు రాకపోవడంతో పాడి ఆవుల వ్యాపారం కుదేలైంది. పుంగనూరు నియోజకవర్గంలో సుమారు 20 వేల పాడి ఆవులు రైతుల వద్ద, వ్యాపారుల వద్ద ఉండిపోయినట్లు సమాచారం. వ్యాపారాలు లేకపోవడంతో పశువుల పోషణ రైతులకు కష్టతరమైంది. ఒకొక్క ఆవుపై సుమారు లక్షరూపాయల వరకు పెట్టుబడి పెట్టి, వాటిని పోషించేందుకు రోజుకు రూ.500లు కావడం బారంగా మారింది. కాగా ప్రతి వారం సుమారు 5 వేల ఆవులు, బర్రెలు , లేగదూడలను లారీలలో కర్నాటక, తమిళనాడు , కేరళలోని కబేళాలకు తరలిస్తుంటారు. ప్రజా రవాణా ఆగిపోవడంతో 30 వేల పశువుల ప్రాణాలకు ముప్పు తప్పింది.

పోలీసులకు, మున్సిపల్‌ కార్మికులకు భోజనం

Tags: Corona break for dairy cows

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *