Corona wants to build with the grace of Srivastava

భారత్‌లో 80 లక్షలకు చేరువగా కరోనా కేసులు

-తాజాగా 43,893 కేసులు.. 508 మరణాలు

Date:28/10/2020

దిల్లీ ముచ్చట్లు:

భారత్‌లో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కేసుల సంఖ్యలో కాస్త పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 10,66,786 పరీక్షలు నిర్వహించగా.. 43,893 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. మంగళవారం ఈ సంఖ్య 36,469గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 79,90,322కు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 508 మంది మృతి చెందడంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,20,010కి చేరింది.తాజాగా 58,439 మంది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో.. ఇప్పటి వరకూ డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 72,59,509కి చేరింది. ప్రస్తుతం 6,10,803(7.64 శాతం) క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 90.85 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.50 శాతంగా కొనసాగుతోంది.

ఇన్సూరెన్స్ కంపెనీల కొర్రీలు

Tags: Corona cases close to 80 lakhs in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *