Corona cases involving three in Punganur

పుంగనూరులో మూడుకు చేరిన కరోనా కేసులు

– రెడ్‌జోన్‌ ఏర్పాటు
– ఆందోళనలో జనం

Date:30/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో కరోనా సోకిన పేషెంట్ల సంఖ్య మూడుకు చేరింది. ఇలా 15 రోజులలో మూడు కేసులు రావడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. పట్టణంలోని రహమత్‌నగర్‌లో తొలికేసు నమోదైంది. ఇలా ఉండగా గత వారం కట్టక్రిందపాళ్యెంలో రెండవ కేసు నమోదైంది. ప్రస్తుతం దోబీకాలనీలో ఒక మహిళకు రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు దోబీకాలనీలోని పరిసరాలలో 200 మీటర్ల ప్రాంతంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌, ఎంబిటి రోడ్డు ఎడమవైపు ప్రాంతం, మార్కస్నగర్‌, దోబీఘాట్‌ వంతెన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా విధించారు. ఈ మేరకు సీఐ గంగిరెడ్డి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, మున్సిపల్‌ ఉద్యోగులు కలసి బ్యారీకెడ్లు నిర్మించారు. రెడ్‌జోన్‌ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. వీటితో పాటు బఫర్‌జోన్‌గా 400 మీటర్ల పరిధి గల ప్రాంతాలను ప్రకటించారు.

వర్తక, వాణిజ్య కార్యకలాపాలపై మల్లగుల్లాలు

Tags: Corona cases involving three in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *