సగానికి తగ్గిన కరోనా కేసులు

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
దేశంలో జనవరితో పోలిస్తే ప్రస్తుతం డైలీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండటం, పాజిటివిటీ రేటు పడిపోతుండటం, డేత్రేట్కూడా ఆందోళనకర స్థాయిలో లేకపోవడం చూస్తుంటే థర్డ్వేవ్ పీక్స్టేజ్ఖతమైనట్టే కన్పిస్తోంది. జనవరి21 నుంచి ఫిబ్రవరి 3 మధ్య రెండు వారాల్లో రోజువారీ కరోనా కేసులు 50 శాతం మేర తగ్గాయి. గత నెలలో అత్యధికంగా 3,47,254  డైలీ కేసులు  నమోదు కాగా.. ప్రస్తుతం 1,72,433కి తగ్గాయి. ఇదే సమయంలో ప్రతి100 టెస్టులకు పాజిటివిటీ రేటు గతంలో 17.94 శాతం ఉంటే ఇప్పుడది 10.99 శాతంగా నమోదైంది. దీన్ని బట్టి ఇన్‌‌‌‌ఫెక్షన్ వ్యాప్తి తగ్గుతోందని స్పష్టమవుతోంది. అయితే కేరళ, మిజోరం రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు కొంత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి అదుపులోకి వస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కేరళ, మిజోరం రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని, పాజిటివిటీ రేటు కూడా అత్యధికంగా ఉందని తెలిపింది. 16 రాష్ట్రాల్లో 100 శాతం మందికి తొలి డోసు పూర్తయినట్లు వెల్లడించింది. దేశంలో సెకండ్వేవ్  పీక్స్టేజ్లో ఉన్నప్పుడు డైలీ కేసులు 4 లక్షలు దాటాయని, ఈసారి జనవరిలో డైలీ కేసులు 3.47 లక్షలు దాటాయని, ప్రస్తుతం తగ్గుతున్నాయని తెలిపింది. ఇక దేశంలో 16 రాష్ట్రాలు/ యూటీల్లో 18 ఏండ్లు పైబడిన100 శాతం మంది అర్హులకు తొలి డోసు పూర్తయినట్లు కేంద్రం తెలిపింది. 15- నుంచి18 ఏండ్ల వయసు వారిలో 65 శాతం మందికి తొలి డోసు అందించినట్లు తెలిపింది.  గడిచిన 24 గంటల్లో దేశంలో 1,72,433 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.16 కోట్లకు చేరుకుందని హెల్త్మినిస్ట్రీ పేర్కొంది. అలాగే కొత్తగా 1,008 మంది వైరస్ తో చనిపోయారని, మొత్తం డెత్స్ 4,98,983కు పెరిగాయని తెలిపింది. ఇక యాక్టివ్ కేసులు15,33,921కి తగ్గాయి. డైలీపాజిటివిటీ రేటు10.99 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు12.98 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు167.87 కోట్ల డోసుల టీకాలు పూర్తయ్యాయి. 2,59,107 మంది కోలుకోగా రికవరీ రేటు ప్రస్తుతం 95.14 శాతంగా ఉంది.
 
Tags: Corona cases reduced by half

Leave A Reply

Your email address will not be published.