దేశంలో తగ్గిన కరోనా కేసులు

హైదరాబాద్ ముచ్చట్లు:


దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. సోమవారం దేశవ్యాప్తంగా 12,751 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో1,31,807 (0.31 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు3.50 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది.

 

Tags: Corona cases reduced in the country

Leave A Reply

Your email address will not be published.