దేశంలో 12 వేల మార్కును దాటిన  కరోనా కేసులు

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. దీంతో రోజువారీ కేసులు మళ్లీ 12 వేల మార్కును దాటాయి. మంగళవారం 9,923 మందికి పాజిటివ్‌ రాగా, నేడు ఆ సంఖ్య 12,249కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,33,31,645కు చేరాయి. ఇందులో 4,27,25,055 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,903 మంది కరోనా రోగులు మృతిచెందారు. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం 81,687 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో మరో 13 మంది కరోనాకు బలవగా, 9,862 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.రోజువారీ పాజిటివిటీ రేటు 3.94 శాతానికి చేరుకున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో 0.19 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.60 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు 196.45 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.కొత్తగా నమోదైన కేసుల్లో ఐదు రాష్ట్రాల్లోనే 74.5 శాతం ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 3659 (29.87 శాతం) కేసులు నమోదవగా, కేరళలో 2,609, ఢిల్లీలో 1,383, కర్ణాటకలో 738, తమిళనాడులో 737 చొప్పున కేసులు ఉన్నాయి.

 

Tags: Corona cases that crossed the 12 thousand mark in the country

Post Midle
Post Midle
Natyam ad