స్వీయ రక్షణ తోనే కరోనా నియంత్రణ సాధ్యం  వైద్య నిపుణులు డా. ధీరజ్ రావు

జగిత్యాల ముచ్చట్లు:

స్వీయ రక్షణతోనే కరోనానునియంత్రణ సాధ్యమని జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ శ్వాస కోశ వ్యాధి నిపుణులు డాక్టర్. ధీరజ్ రావు అన్నారు.గురువారం కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ జగిత్యాల అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ ప్రవాస భారతీయులు ఒమన్ ఫ్రెండ్స్ అధ్యక్షుడు పన్నీర్ నరేంద్ర సారధ్యంలో డాక్టర్ ధీరజ్ రావుకు ప్రకటించిన కరోన వారియర్స్ అవార్డును  జానకి చెస్ట్ హాస్పిటల్ కార్యాలయములో వారు అందజేశారు.
ఈసందర్బంగా ధీరజ్ రావు మాట్లాడుతూ కరోనా రెండవ వేవులో ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ధైర్యంగా ఉండడంతో పాటు స్వీయ నియంత్రనలో ఉండి , డాక్టర్ సలహాలు పాటిస్తూ, పోషకాహారాన్ని తీసుకుంటే కరోనాను జయించవచ్చని పేర్కొన్నారు.కరోనా సమయంలో పలువురు రోగులకు ఆహారం, మందులు స్వచ్ఛందంగా అందించడం అభినందనీయమన్నారు. ప్రజలు, అన్నివర్గాల సహకారంతో కరోనా రోగులకు సేవాలాందించానని తెలిపారు.కిషన్ రెడ్డి, రాజు,రాజేందర్ లు మాట్లాడుతూ జగిత్యాలలో కరోనా సమయంలో ప్రజలకు, ముఖ్యంగా కరోనా రోగులకు  డాక్టర్ దీరజ్ రావు వైద్య సేవాలాందించారాని కొనియాడారు. ఇసందర్బంగా డాక్టర్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జగిత్యాల అధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, ఉపాధ్యాయ సంఘాల నాయకుడు బి. ఆనంద్ రావు, పాత్రికేయుడు పెండం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Corona control is possible with self-defense
Medical experts Dr. Dheeraj Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *