Corona control measures bash

కరోనా నియంత్రణ చర్యలు బేష్‌

– స్వీయ నియంత్రణ పాటించండి
-ఆందోళన చెందకండి
– ఎంపీరెడ్డెప్ప

Date:26/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనాను నియంత్రించేందుకు మున్సిపాలిటి , రెవెన్యూ, పోలీస్‌ , వైద్యశాఖల అధికారులు తమ ఆరోగ్యాలను లెక్కచేయకుండ ప్రజలకు సేవలు అందించడం ప్రశ ంసనీయమని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప అన్నారు. గురువారం పట్టణంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది హైడ్రోక్లోరైడ్‌ మందును పట్టణంలో పిచికారి చేసే కార్యక్రమాన్ని ఎంపీ రెడ్డెప్ప, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్నిశాఖల అధికారులు నిరంతరం సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారని కొనియాడారు. ప్రజలు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంటిలోనే ఉండిపోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు అధికారులకు సహకరించి, రోడ్లపై తిరగడం నిలిపివేస్తే కరోనా దరిదాపుల్లోకి రాదని , దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. జిల్లాలో కరోనా ప్రభావం నామమాత్రంగా ఉందని, ఇది ఎంతో అదృష్టమన్నారు. అన్ని ప్రాంతాల్లోను అధికారులకు సహకరించాలని కోరారు.

ఏపీ లో 10కి చేరిన కరోనా కేసులు

Tags: Corona control measures bash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *