గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు

Date:03/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాలలో కరోనాను నియంత్రించేందుకు గాలిలోకి సోడియం హైడ్రోక్లోరైడ్‌ మందును స్ఫ్రే చేస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని రాగానిపల్లెలో ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి మురుగునీటి కాలువలు శుభ్రం చేయించారు. అలాగే మంచినీటి ట్యాంకుల్లో క్లోరైడ్‌ను కలిపారు. కాలువల్లో  బ్లీచింగ్‌ ఫౌడర్‌ వేశారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటి స్తూ ఈనెల 14 వరకు ఇండ్లలోనే ఉండిపోవాలని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు రెడ్డెప్ప, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, సురేంద్ర, జయరాం తదితరులు పాల్గొన్నారు.

పాడి ఆవుల వ్యాపారానికి కరోనా బ్రేక్‌

Tags: Corona control measures in villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *