కరోనా కాటేసింది

రంగారెడ్డిముచ్చట్లు:

 

కరోనాతో నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు బలి అయ్యారు.  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి గ్రామానికి చెందిన పెదిరిపాటి విఠలయ్య సులోచన దంపతులకు ముగ్గురు కుమారులు ఒ కుమార్తె. అయితే ఎప్రిల్ 26న రెండవ కుమారుడు వివాహ వార్షికోత్సవ వేడుకలు కుటుంబ సభ్యులతో బదువులతో కలిసి చేసుకున్నాడు. దీంతో కుటుంబంలోని ఐదు మంది కరోనా బారిన పడ్డారు. మే 1న సులోచనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ  మృతి చెందింది. అస్వస్థతకు గురైన కుమారుడు సుభాష్ గౌడ్,  కుమార్తె లావణ్య లను ఆస్పత్రికి తరలించారు. 25 రోజుల అనంతరం ఈ నెల 8న సుభాష్ గౌడ్ తుది శ్వాస విడవగా 31 రోజులు మృత్యువుతో హాస్పిటల్ లో పోరాడి లావణ్య సైతం కన్నుమూసింది. అ ఇంట్లో కుమారుడి దశదిన కర్మ రోజే కుమార్తె అంత్యక్రియలు చేయడంతో పలువురు స్థానికులు సైతం కట్టతడి పెట్టారు. లావణ్య భర్త కిరణ్ 10 సంవత్సరాల క్రితం మృతి చెందాడు అప్పటి నుండి లావణ్య అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది. సుభాష్ గౌడ్ భార్య ఇంటి వద్దనే వుండి కరోనాను జయించగా. కుమారుడు కోలుకున్నాడు.  భార్య, కుమారుడు, కుమార్తెను బతికించడానికి నెలరోజుల పాటు కార్పోరేట్ హస్పత్రిలో 80 లక్షలు ఖర్చుపెట్టిన ముగ్గురి ప్రాణాల దక్కలేదు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Corona cut

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *