లాక్ డౌన్ ముగింపునాటికి అదుపులోకి కరోనా : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ముచ్చట్లు :

లాక్ డౌన్ ముగింపునాటికి కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే మొదటి, రెండోవేవ్ కరోనాను ఎదుర్కొంటున్నామని రాబోయే రోజుల్లో ఎలాంటి ఉత్పన్నాలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే మాట్లాడదలచుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రజలకు మాత్రమే కాకుండా ఐదు రాష్ట్రాల (మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ) ప్రజలకు వైద్య సేవలు అందిస్తుందని అన్నారు.  కాగా శుక్రవారం మంత్రి కేటీఆర్ టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లను పరామర్శించారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలో  సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Corona detained till the end of lockdown: Minister KTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *