Kovid from Rua Hospital today - 19 victims

తాడేపల్లిలో కరోనా కలకలం

Date:09/05/2020

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రకాష్ నగర్ లో కరోనా కలకలం సృష్టించింది.  ఓకే కుటుంబంలో లో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడ మాచవరం డౌన్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కొడుకు ని చూడడానికి తాడేపల్లి ప్రకాష్ నగర్ కు వచ్చాడు. ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉండటంతో వైద్యం నిమిత్తం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మరణించగా తాడేపల్లి ప్రకాష్ నగర్ లో ఉంటున్న పెద్ద కుమారుడు చేతుల మీదగా గా అంత్యక్రియలు నిర్వహించారు. మరణించిన వ్యక్తి కి కరోనా పాజిటివ్ అని వైద్యులు  నిర్ధారించిన వైనం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్న బంధుమిత్రులను దాదాపుగా 60 మందిని కోరం టైన్ కు తరలించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు తాడేపల్లి ప్రకాష్ నగర్ లో 6 పాజిటివ్ కేసులు గా నిర్ధారణ వీరిలో విజయవాడ మాచవరం సంబంధించిన వారు ఎంత మంది తాడేపల్లి ప్రకాష్ నగర్ కు సంబంధించిన వారు ఎవరో తెలియాల్సి ఉంది.

డెస్క్ జర్నలిస్టులను ఆదుకున్న గాయత్రి రవి

Tags: Corona disturbance in tadepalli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *