మాస్క్ దరించకపోతే కరోనా ఎఫేక్ట్
-మాస్క్ దరిస్తే కుక్కల కాటుకు బలి
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి పట్టణంలో విది కుక్కల తో పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్నారు.పురపాలక సంఘ పరిధిలో ని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు ఎక్కువ గా ఉన్నాయి. అసలే కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇదేమి కర్మరా రా అంటు ప్రజలు నా నా అవస్థలు పడుతున్నారు. కుక్కలు రాత్రి పగలు తేడా లేకుండా స్కూలు కు వెళ్ళే చిన్నారుల ను, రాత్రి సమయం లో వృద్దుల ను సైతం పరిగెత్తిస్తున్నాయి. రాత్రుల్లో కుక్కల అరుపుల తో వీధుల్లో కుక్కల రాజ్యం ఎర్పడింది. కొండమిట్ట పరిధిలో కుక్కలు ఎక్కువ ఉన్నాయి. ముత్యాలమ్మ గుడి, నగరి వీధి, కైకాల విధి, బజారు వీధి, దర్గా మిట్ట, శ్రీ రాంనగర్ కాలనీ, తదితర ప్రాంతాల్లో కుక్కల కాటు వల్ల పిల్లలు మహిళలు ఆసుపత్రి పాలౌతున్నారు. ఇకనైన అధికారులు స్పందించి కుక్కల కాటు ప్రమాదం నుంచి తగు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ ను శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Corona effect if mask is not worn