AP Kovid-19 Command Control Room

 కరోనా ఎఫెక్ట్…పురోహితుడు ఆత్మహత్య

Date:10/08/2020

ఏలూరు ముచ్చట్లు:

 

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో గత ఐదు నెలలుగా వివాహాది శుభకార్యాలు లేకపోవడం అలాగే ఆలయాలు కూడా మూసివేయడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురోహితుడు పవన్ కుమార్ గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద వెలుగు చూసింది
భీమలపురం గ్రామస్తుడైన పురోహితుడు పవన్ కుమార్ గత 15 సంవత్సరాలుగా పాలకొల్లు లో నివాసముంటూ పౌరోహిత్యం పై ఆధారపడి తల్లిదండ్రులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు లాక్ డౌన్ నేపథ్యంలో ఓ పక్క వివాహాది శుభకార్యాలు లేక మరోపక్క ఆలయాలు కూడా మూసివేయడంతో ఇటు తాను జీవనం సాగించలేక అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించలేని పరిస్థితిలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద గోదారిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అయితే బ్రిడ్జి పైన పవన్ కుమార్ సెల్ ఫోన్, మోటర్ బైక్, చెప్పులు ఉండటం గమనించి పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

 కరోనా ఎఫెక్ట్…పురోహితుడు ఆత్మహత్య

 

Tags:Corona Effect… Priest commits suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *