దేశం లో మరింత తగ్గుముకం పట్టిన దేశంలో కరోనా మహమ్మారి    గడిచిన 24 గంటల్లో 48,698 కేసులు నమోదు

న్యూఢిల్లీ   ముచ్చట్లు:

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం దిగి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 48,698 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 64,818 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. అలాగే కొత్తగా వైరస్‌ బారినపడి 1,183 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో 3,01,83,143కు చేరింది. ఇప్పటి వరకు 2,91,93,085 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 3,94,493 మంది మృత్యువాతపడ్డారు. 86 రోజుల తర్వాత ఆరు లక్షలకు దిగువకు క్రియాశీల కేసులు చేరుకున్నాయని, ప్రస్తుతం దేశంలో 5,95,656 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది.ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 96.72 శాతానికి పెరిగిందని, వ్లీకీ పాజిటివిటీ రేటు 2.97 శాతంగా ఉందని చెప్పింది. వరుసగా 19 రోజులు రోజువారీ పాజిటివిటీ రేటు 2.79 శాతానికి పడిపోయిందని తెలిపింది. మరో వైపు టీకా డ్రైవ్‌ దేశంలో ముమ్మరంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 61.19లక్షల టీకా డోసులు వేసినట్లు చెప్పింది. ఇప్పటి వరకు 31.50 మోతాదులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. కరోనా టెస్టులు సైతం భారీగానే సాగుతున్నాయి. ఇప్పటి వరకు 40.18కోట్ల శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వివరించింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Corona epidemic in a country with a further decline in the country
48,698 cases were registered in the past 24 hours

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *