48 new corona positive cases registered

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది..

Date:22/05/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

◆గతకొన్ని రోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 5వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.గడచిన 24గంటల్లో అత్యధికంగా 6088 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి..◆ఒకేరోజు పాజిటివ్‌ కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి.దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,18,447కి చేరింది..వీరిలో నిన్న ఒక్కరోజే 148మంది మృత్యువాతపడడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3583కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది..◆మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 48,534మంది కోలుకోగా మరో 66,330మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.ప్రస్తుతం చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 2.94శాతం మందికి అత్యవసర విభాగంలో(ఐసీయూ)లో చికిత్స అందిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది..◆అంతేకాకుండా దేశంలో కొవిడ్‌ బాధితుల్లో రికవరీ రేటు దాదాపు 40శాతం ఉంది.ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 మరణాల రేటు సరాసరి 6.65శాతం ఉండగా భారత్‌లో 3.06శాతంగా ఉంది…◆కరోనా సోకి మరణిస్తున్న వారిలో దాదాపు 64శాతం పురుషులే ఉండగా 36శాతం మహిళలు ఉన్నారు.ఇదిలాఉంటే, కరోనా తీవ్రత పెరగడంతో దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా భారీ స్థాయిలోనే జరుపుతున్నారు..◆దేశవ్యాప్తంగా ఉన్న 555 టెస్టింగ్‌ ల్యాబ్‌ల ద్వారా ఇప్పటివరకు 26లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది.గతకొన్ని రోజులుగా ప్రతిరోజు లక్షకుపైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

మే 25 నుండి 13 జిల్లా కేంద్రాల్లోని

Tags: Corona Epidemic in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *