Natyam ad

డాక్లర్లకు కరోనా

కర్నూలు ముచ్చట్లు:
 
దేశంలో మళ్ళీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. కరోనా పై పోరాటం చేయడంలో ముందున్న ప్రంట్ లైన్ వారియర్స్ ముఖ్యంగా వైద్య సిబ్బంది భారీగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజ్‌లో నలుగురు హౌస్ సర్జన్‌లతో పాటుగా పలువురు విద్యార్థులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..కర్నూలు జిల్లాలోని మెడికల్ కాలేజ్‌లో 50 మంది వైద్య విద్యార్థులకు, వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కాలేజీలో మొత్తం 15మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. నలుగురు హౌస్ సర్జన్‌లకు, 11మంది మెడికల్ స్టూడెంట్స్ కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ  11 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. కరోనా బారిన పడిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్సనందిస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.  కొత్తగా 1,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,78,964కి చేరినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా చూస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. భారీగా కొత్త కేసులు నమోదవుతూ భయాందోళన కలిగిస్తోంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Corona for dockers

Leave A Reply

Your email address will not be published.