Corona growing due to defects in the volunteer system: Raghurama

వాలంటీర్ వ్యవస్థలో లోపాల వల్లే పెరుగుతున్న కరోనా: రఘురామ

Date:08/08/2020

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

ప్రభుత్వంపై, వాలంటీర్ వ్యవస్థపై మరోసారి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయని మన పార్టీ నాయకులే సోషల్ మీడియాలో గొప్పలు చెబుతున్నారు. నిజంగానే వాలంటీర్లే అంతా బాగా పని చేస్తే కోవిడ్ కేసులు ఎందుకు పెరిగాయి. వాలంటీర్ వ్యవస్థలో వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టాల్సి ఉందన్నారు. వాలంటీర్ వ్యవస్థలో లోపాలు లేవా?, ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తెలియకుండా ఫ్రాంక్లిన్‌ ఎందుకు కితాబు ఇచ్చారో అర్థం కావట్లేదన్నారు. మనకు కితాబులు కాదు.. గ్రౌండ్‌ రియాల్టీ కావాలి. ఫ్రాంక్లిన్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండానే మెచ్చుకున్నారు. ఓ వైపు కోవిడ్‌తో మనుషులు చచ్చిపోతుంటే.. ఫ్రాంక్లిన్ వార్తను సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు. కితాబు ఇస్తే.. దాన్ని ప్రచురించడం అంత అవసరమా?, శ్మశానాల్లో కూడా రోగులకు టెస్టులు చేశారు. ఏపీలో కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఒకసారి ఆలోచించాలి. కరోనా విషయంలో చాలా అలసత్వం వహించారు. విశాఖ ఎప్పుడు వెళ్లిపోదామన్న ఆలోచనతోనే ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో కరోనాను బాగానే కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఏపీలోనే పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. తాడేపల్లిగూడెం కోవిడ్ సెంటర్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 

తిరుమలలో ఆగస్టు 12న గోకులాష్టమి ఆస్థానం, 13న ఉట్లోత్సవం

Tags:Corona growing due to defects in the volunteer system: Raghurama

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *