2,392 new corona positive cases confirmed in Telangana

కంట్రోల్ లో క‌రోనా

Date:26/10/2020

న్యూఢిల్లీ ‌ ముచ్చట్లు:

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811కి చేరింది. నిన్న ఒక్క రోజే 578 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,18,534 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 62,077 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 70,78,123 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,64,811గా ఉండగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,68,154గా ఉంది.  కరోనా బారినపడి వారిలో దాదాపు 90 శాతం కోలుకుంటున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.51 శాతం తగ్గినట్టు వివరించింది.తెలంగాణలో 978 కేసులు మాత్రమే నమోదైనట్టు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

 

 

రాష్ట్రవ్యాప్తంగా  ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,31,252కు పెరిగింది. అలాగే, నిన్న కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,307కు పెరిగింది. తెలంగాణలో 1,446 మంది కోలుకోవడంతో ఈ మొత్తం సంఖ్య 2,10,480కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 19,465 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, వీరిలో 16,430 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న రాత్రి 8 గంటల నాటికి 185 కేసులు నమోదయ్యాయి.ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 74,919 నమూనాలు పరీక్షించగా 3,342 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 551 కొత్త కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 60 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 22 మంది కరోనాతో మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,566కి పెరిగింది. తాజాగా 3,572 మందికి కరోనా నయం అయింది.ఓవరాల్ గణాంకాలు చూస్తే, ఏపీలో మొత్తం 8,04,026 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,65,991 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 31,469 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 75,02,933 నమూనాలు పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

 

ఐరోపాలో క‌రోనా ప్ర‌తాపం మరోసారి ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు ఆంక్షలు విధించే దిశగా కదులుతున్నాయి. తాజాగా, ఇటలీలో నవంబరు 24 వరకు ఆంక్షలు విధిస్తూ ఆ దేశ ప్రధాన మంత్రి గియుసేప్ కొంటే ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ కట్టడికి నవంబరు 24 వరకు జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, సినిమా థియేటర్లను మూసివేయాలని ఆదేశించారు. అంతేకాదు, ప్రజలందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ గియుసేప్ నిర్ణయం తీసుకున్నారు.గతంలోనూ మహమ్మారి నియంత్రణకు 10వారాల లాక్ డౌన్ విధించారు. ప్రజల ఆరోగ్యంతోపాటు ఆర్థిక వ్యవస్థను రక్షించడమే తమ లక్ష్యమని కొంటే పునరుద్ఘాటించారు. తాజా నిషేధం సోమవారం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. గడిచిన రెండు రోజుల్లో 20వేల మందికి కొత్తగా వైరస్ నిర్దారణ అయ్యింది. బ్రిటన్ తర్వాత ఇటలీలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి.బార్ అండ్ రెస్టారెంట్లను సాయంత్రం 6 గంటలకు మూసివేయడం సహా అమెరికా, ఇతర దేశాల నుంచి పర్యాటకుల రాకను నిషేధించింది.

 

 

 

కొత్త నిబంధనల ప్రకారం వివాహాలు, రిసెప్షన్లు, మత లేదా పౌర వేడుకలను నిషేధించారు. జిమ్‌కు వెళ్లకుండా ఆరుబయట వ్యాయామం చేయవచ్చని ఇటలీ సర్కారు సూచించింది.కాగా, కంపానియాలో కర్ఫ్యూ విధించడాన్ని నిరసిస్తూ వందలాది మంది ముఖ్యమంగా యువత పోలీసులతో గొడవకు దిగారు. మరోవైపు, స్పెయిన్ కూడా ఎమర్జెన్సీ విధించింది. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనున్నట్టు తెలిపింది. కరోనా కేసులు ఒక్క మిలియన్ దాటిన తొలి పశ్చిమ ఐరోపా దేశంగా స్పెయిన్ నిలిచింది.ఇప్పటికే ఇటలీ, స్పెయిన్‌లు కరోనా వైరస్ కోలుకోలేని దెబ్బకొట్టింది. మహమ్మారి విషయంలో ప్రపంచం ప్రస్తుతం ఓ కీలక మలుపులో ఉందని, ఈ సమయంలో కొన్ని దేశాలు ప్రమాదకర మార్గంలో ప్రయాణిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధ్నోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఐరోపాలో ఇటువంటి పరిస్థితి ఉంది. ఐరోపాలో 8.2 మిలియన్ల మంది కరోనా బారినపడగా.. దాదాపు 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

32 మంది నక్సల్స్ లొంగుబాటు. 

Tags: Corona in control

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *