కిమ్….మాములోడు కాదు

Date:14/09/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

అనారోగ్యంతో ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్ చనిపోవాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారా? అక్కడి క్రూరమైన రూల్స్ తెలిస్తే.. మీరు కూడా అదే కోరుకుంటారు.కిమ్ జంగ్ ఉన్.. ఇతడి పేరు వింటే అమెరికా సైతం వణికిపోతుంది. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాలు గురించి తెలిస్తే.. మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది. కేవలం కిమ్ మాత్రమే కాదు. అతడి కుటుంబం మొత్తం అంతే. వారికి ఎవరైనా ఎదురైతే సొంతవాళ్లని కూడా చంపేయడం వారి ఆనవాయితీ. అలాంటి ఆ ప్రభుత్వంలోని అధికారులు, ఆ దేశంలో నివసించే ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఆ దేశంలో ఇప్పటికీ సుమారు 100 ఏళ్లు వెనకబడే ఉందంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంటర్నెట్ ఉండదు. కేవలం మూడే టీవీ చానెళ్లు మాత్రమే ఉంటాయి. ఫోన్లు ఉపయోగించకూడదు. అక్కడి పేదలకు ఫొటోలు తీయకూడదు. ఇలా ఒకటేమిటీ ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి.

 

 

 

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అల్లాడుతుంటే.. ఆ దేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే, ఇన్నాళ్లు ఆ దేశాన్ని పీడించిన కిమ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడనే సమాచారం తెలియగానే.. ఇప్పుడు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా అతడి పీడ వదులుతుందా ఎదురుచూస్తున్నారు. అలా ఎందుకు కోరుకుంటున్నారో తెలియాలంటే.. ఈ కఠోర వాస్తవాలను తెలుసుకోవల్సిందే.ఉత్తర కొరియాలోకి అడుగుపెట్టగానే తప్పకుండా కొత్త గ్రహానికి వెళ్లాం అనిపిస్తుంది. అక్కడి ప్రజలను చూస్తే.. తప్పకుండా జాలి కలుగుతుంది. అక్కడి నిబంధనలు గురించి తెలిస్తే.. అసలు మానవ హక్కులు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌‌ను అక్కడి ప్రజలకు దేవుడు అనుకుంటారు. కాదు.. కాదు.. అలా ఒప్పుకుని తీరాలి. లేకపోతే వాళ్లు ప్రాణాలతో ఉండరు.ఆ రోజులు వరుసగా పని చేయాలంటేనే మనకు విసుగు వస్తుంది. కానీ, ఆ దేశంలో వారంలో ఏడు రోజులు పనే. బయటకు మాత్రం వారంలో ఆరు రోజులు మాత్రమే పని అని చెబుతారు. కానీ, సెలవు రోజు మాత్రం ఖాళీగా ఉండనివ్వరు. ఆ రోజు కూడా ప్రజలు వాలంటీర్‌గా పనిచేయాలి. అంటే.. అక్కడ ఏడు రోజులూ పని చేయాల్సిందే.కిమ్ తనని తాను దైవంగా భావిస్తాడు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్నాళ్ల కిందట తన బయోగ్రఫీని విడుదల చేశాడు. అందులో.. తాను రెండు ఇంధ్ర దనస్సుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంతేకాదు.. అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉదంట. దైవం పుట్టించిన కారణ జన్ముడనని కిమ్ భావిస్తుంటాడు.

 

 

అక్కడి సంవత్సరం వేరు.. మన సంవత్సరం వేరుఉత్తర కొరియాలో ఈ ఏడాది 2020 కాదు. అక్కడ ప్రస్తుతం 107వ సంవత్సరం నడుస్తోంది. అదేంటీ కొత్తగా అనుకుంటున్నారా? ముందే చెప్పాం కదా.. అది ప్రపంచం నుంచి వేరు చేయబడిన దేశమని. అక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి. ఆ దేశంలో మన క్యాలెండర్‌ను అస్సలు ఫాలో కారు. ‘కిమ్-2 సంగ్’ పుట్టిన రోజు నుంచే అక్కడి క్యాలెండర్‌ను లెక్కిస్తారు. ఆ రోజే వారికి న్యూ ఇయర్ కూడా. ఈ దేశానికి ప్రత్యేకమైన టైం జోన్ కూడా ఉంది. జపానీయుల కంటే 30 నిమిషాలు ముందుకు సమయాన్ని మార్చుకున్నారు.దక్షిణ కొరియా అశ్లీల చిత్రాలకు పెట్టింది పేరు. కానీ, ఉత్తర కొరియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆ దేశంలో ఎవరైనా పోర్న్ చూస్తున్నారనే అనుమానం కలిగినా చాలు చంపేస్తారు. అంతేకాదు, ఎవరూ బైబిల్ చదవ కూడదు. ఎవరి వద్దనైనా అది కనిపిస్తే చావే. ఆ దేశంలోని ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది. అదెప్పుడూ ఆన్‌లోనే ఉండాలి. ఆపితే.. శిక్ష తప్పదు.పేదలకు ఫొటోలు తీయకూడదుఉత్తర కొరియా ప్రజలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా కిమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పర్యాటకులు అక్కడి పేదలకు ఫొటోలు తీయకూడదు.

 

 

 

అందుకే ఆ దేశానికి వెళ్లే పర్యటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. ఫోన్లతో ఆ దేశంలో తిరగకూడదు. పర్యటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ తిరగకూడదు.ఉత్తర కొరియాలో జులై 8, డిసెంబరు 17 తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు. కనీసం పుట్టిన రోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే.. కిమ్ తాత కిమ్ 2 సంగ్, కిమ్ తండ్రి కిమ్ జంగ్ 2లు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ పూర్వికులు కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్రను బోధిస్తారుమూడే టీవీ చానెళ్లు.. ఇంటర్నెట్ ఉండదుమన దేశంలో దూరదర్శన్‌కు ఉన్నన్ని చానెళ్లు కూడా ఆ దేశంలో ఉండవు. అక్కడ కేవలం మూడు టీవీ చానెళ్లకు మాత్రమే అనుమతి ఉంది. వాటిలో కూడా కేవలం స్థానిక వార్తలు మాత్రమే ప్రసారమవుతాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి తెలీదు. అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం వీఐపీలకు మాత్రమే ఇంటర్నెట్ ఇస్తారు. ఇందుకు రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.ఉత్తర కొరియా ప్రజలు నేరాలు చేయాలంటేనే భయపడిపోతారు.

 

 

 

ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే.. అతడి తర్వాతి రెండు తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే.. మూడు తరాలు తమ జీవితమంతా జైల్లోనే గడపాలన్నమాట. ఆ దేశంలో కిమ్ ఆగడాలను వ్యతిరేకించి అనేక మంది జైల్లో ఉన్నారు. సుమారు 2.5 లక్షల మంది బంధీలుగా ఉన్నారు. వారు తప్పించుకోకుండా జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారుఏకంగా నకిలీ నగరాన్నే నిర్మించేశాడుశత్రు దేవమైన దక్షిణ కొరియాన్లను ఎర వేయడానికి ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది. అక్కడ ఎవరూ నివసించరు. రాత్రివేళ్లల్లో మాత్రం ఇళ్లలో లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్లు భ్రమ కల్పిస్తారు. అయితే, దక్షిణ కొరియా తెలివి తక్కువది కాదు. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించి అప్రమత్తంగా ఉంటోంది. కిమ్ మరణం తర్వాత దురాక్రమణకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.కిమ్ జాన్ ఉన్ 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ‘ప్లెజర్ స్క్వాడ్’ను ఏర్పాటు చేశాడు. వాళ్లు కిమ్‌తో పాటు అతని సైనికులకు ‘అన్ని’ రకాల పనులు చేయాలి. వీరిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికం. వీరిలో కిమ్ వద్ద పనిచేసే మహిళలు వేరేగా ఉంటారు. కిమ్ ఎప్పుడు కోరితే అప్పుడు కోరికలు తీర్చాలి. మిగతా బాలికలు సైతం కిమ్‌కు సేవలు అందించే సైన్యం సెక్స్ కోరికలు తీర్చాలి.ఎన్నికలు ఉంటాయ్,

 

 

 

కానీ..ఉత్తర కొరియాలో కూడా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతాడు. అది ఎవరో మీకు తెలిసిందే. ప్రజలకు అతడు నచ్చనట్లయితే.. తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి. ఆ తర్వాత వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే! ఆ ధైర్యం చేయలేక ప్రజలు కిమ్‌నే తమ అధినేతగా అంగీకరిస్తున్నారు.✺ కిమ్ జాన్ ఉన్ తన మావయ్యను దుస్తులు విప్పి, ఆకలితో ఉన్న 120 వీధి కుక్కల బోనులో వేసి చంపేశాడు. ✺ ఈ దేశంలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు. ఇక్కడి ఇళ్లు ఇళ్లు బూడిద రంగులోనే ఉండాలి. ఇళ్ల బయట తప్పకుండా కిమ్ పూర్వికులు, నాయకుల ఫొటోలు ఉండాలి. ✺ మగవాళ్లంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్‌ స్టైల్‌నే అనుకరించాలి. ఇప్పుడు చెప్పండి, అక్కడి ప్రజలు కిమ్ మరణం కోసం వేచి చూడటంలో తప్పే లేదనిపిస్తోంది కదూ.

వూహాన్ ల్యాబ్ లోనే క‌రోనా

Tags:Corona in the Wohan Lab itself

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *